Thursday, December 30, 2010

ఇచ్చట చిలక జోస్యం చెప్పబడును...

కే.సి.ఆర్. కి పగటి కలలు ఎక్కువయ్యాయి. మధ్యతర ఎన్నికలలో తెలంగాణాలో టి.ఆర్.ఎస్., సీమాంధ్రలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారట. జగన్ దగ్గర డబ్బుకి ఎం.ఎల్.ఏ. టిక్కెట్లు, పదవులు ఆశించే వాళ్ళు ప్రలోభపడవచ్చు కానీ జనం నమ్మే స్థితిలో లేరు.
ఇక తెలంగాణా వస్తే తెలంగాణలో తమ ఇమేజ్ పెంచుకోవటం కోసమే కాంగ్రెస్ ఎం.పీ.లచే డ్రామా ఆడించి వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేసి విద్యార్థి నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి కాంగ్రెస్ ధన, కుటిల రాజకీయాల ముందు తన ఎం.ఎల్.ఏ.లు, పార్టీ సభ్యులు కాంగ్రెస్ లో చేరకుండా ఆపటం కే.సి.ఆర్.కి తలకు మించిన పని అవుతుంది. లేదా గద్దర్ వంటి ఆలోచనాపరులు ఉండగా కే.సి.ఆర్. వంటి అవకాశవాదులను తెలంగాణా ప్రజలు గద్దెనెక్కిస్తారనుకోను.
ఆపై కే.సి.ఆర్. చేయగలిగేది ముందు గుడ్డపరుచుకొని బోర్డు పెట్టుకోవటమే ఇచ్చట చిలక జోస్యం చెప్పబడును అని!

7 comments:

  1. ప్రజలకు అ౦త సీన్ లేదు. ఏ వ౦దో వెయ్యో పడేసి, కాసి౦త బిర్యానీ, చీర ప౦చేస్తే ఓట్లేసేత్తారు

    ReplyDelete
  2. without knowing basics of politics its not fair to comment in loose. if you don't know the political arena of andhrapradesh.. let study about politics.. votes.. equations.. poll management of various parties.. vote banks of political parties.. local issues.. local leadership.. reaching benefits from govt to poor. than you analyze and comment on political Scenario of our state.

    ReplyDelete
  3. thanks for your comments.
    but don't you know what happened in Bihar recently. do you think lack of money or group politics are the main reason for Congress and Laloo Yadav's loss in election. Now people are more watchful. Even they take money, biryanee etc they vote for the candidate they believe in.

    ReplyDelete
  4. akkada nitish unnaadu...ikkada evarunnaru annay??....unna okka Y.S ni sonia mingesindi....

    ReplyDelete
  5. @@@ ప్రజలకు అ౦త సీన్ లేదు. ఏ వ౦దో వెయ్యో పడేసి, కాసి౦త బిర్యానీ, చీర ప౦చేస్తే ఓట్లేసేత్తారు @@@



    థాంక్ యు anan,

    బాగా పజల గురించి అర్ధం చేసుకుని చెప్పినట్లున్నావ్ ఈ విషయాన్ని ..

    గత ఎన్నికల్లో నువ్వెంత తీస్కుని ఓటు వేశావ్ ?



    వందో వెయ్యో తీస్కుని ప్రజలగా మనం అమ్ముడు పోతున్నప్పుడు లక్షల రూపాయాలు ఖర్చు పెట్టిన ( మనం ఓటేసి ఎన్నుకున్న (ఎన్నుకున్న అనే పదం కరెక్ట్ కాదేమో ?)) రాజకీయ నాయకులు వాల్లెంతకు అమ్ముడు పోవాలి ?



    బిర్యాని . సీర తీస్కుని వోటేసే జనాలకు నువ్వన్నట్టే సీన్ ఎప్పుడూ ఉండదు ..

    వాళ్లకు నాయకులు అమ్ముడు పోయినా , తల మీద పాగా సేతిలో సిలక, చెట్టుకి బోర్డు పెట్టుకున్నా కనిపించదు కూడా !


    కానీ నాకెందుకో ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించింది ..

    బిర్యానీ పొట్లాలు పంచిన ప్రతీ రాజకీయ నాయకుడూ ఎందుకు గెలవట్లేదు ?


    బహుసా వందకో . వెయ్యికో ,చీరకో , బిర్యానీ పోట్లానికో అమ్ముడు పోయినా , ఎంతమది ఇచ్చినా .

    వాళ్ళు మాత్రం ఓటు వాళ్ళు నమ్ముకున్నోల్లకే వేస్తున్నారు కావటం వాళ్ళ అనుకుంటా ..

    ReplyDelete
  6. Yes. You are right. But Nitish got opportunity when public realized facts about Laloo. Now the situation is same here. Here also people bored of Congress.
    I think Telangana public also not supporting KCR heart-fully. Just they don't want to divide into groups in crucial time. If they get Telangana, after achieving it with so much difficulty they don't want to put it in hands of KCR. (For this KCR has to blame himself only. His family thinks Telangana movement as their own property. Even KCR led the long battle, his provoking manner make people dislike telangana movement)

    ReplyDelete
  7. బంగారు గుడ్లు పెట్టే బాతునెందుకు కోసుకుంటారు అని ఇక్కడో విశ్లేషణ యిచ్చారు చూడండి. తెలంగాణా కోసం పోరాడుతున్నమనుకునే సోదరులకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, పూర్తిగా చదవండి.
    మనమేపని చేద్దమనుకున్నా ’ఒకవేళ మనమనుకున్నట్లు కాకపోతే’(what if) అని ఒకసారి ఆలోచిస్తాం. అలాగే యిది నిజమైతే ఏంటి అని ఆలోచించండి.
    http://telugushakthi.com/2010/12/30/kcr-on-telangan-issue/

    ReplyDelete