Saturday, December 11, 2010

అసెంబ్లీ రౌడీలు...

విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీల వారు డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయం లో జయప్రకాష్ గారి విశ్లేషణ చాలా బావుంది. ఎవరైతే హింసాత్మక చర్యలకు పాల్పడలేదో, ఆస్తులకు నష్టం కలిగించలేదో, బలవంతపు వసూళ్ళకు పాల్పడలేదో వాళ్ళని ప్రాంతాలకు, ఉద్యమాలకు అతీతంగా విడుదల చేయాలని మిగిలిన వారిని శిక్షించాలని అన్నారు. కానీ ఇది మిగిలిన వారికి ఎందుకు రుచించటం లేదు? ఎందుకంటే విధ్యార్ధులను హింసకి పురికొల్పింది వాళ్ళే కనుక. ఇప్పుడు విద్యార్ధుల విడుదలపై స్పష్టమైన హామీ లేకుండా బయట అడుగు పెడితే విద్యార్ధులు తంతారనే భయం తోనే డ్రామాలు ఆడుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు  బలవంతపు వసూళ్లు అనగానే టి.ఆర్.ఎస్. ఎందుకు ఉలిక్కి పడుతున్నట్లో?!!! విద్యార్ధుల కన్నా ముందు వాళ్ళని ప్రేరేపించిన అసెంబ్లీ రౌడీలను గుర్తించి జీవితకాలం వారి కుటుంబం మొత్తాన్ని రాజకీయాల నుండి బహిష్కరిస్తే కానీ ఇటువంటి సంఘటనలను అదుపు చేయలేము.

2 comments:

  1. జేపి సరైన మాటలు సరైనవే....సమయం సరైనదే...కాని సందర్భం సరైంకాదు.....

    నావాదనే సరైందన్న భావన మితిమీరడం వల్ల ఇలా జరుగుతుంది....

    జేపిగారి అమాయకమైన నీతి మాటల వల్ల ...
    సంవత్సరం క్రితమే ఇచ్చిన మాట తప్పుతున్న,
    ఉద్దెశ్యపూర్వకంగా తాత్సారానికి పాల్పడుతున్న,
    వారిని విడుదల చేయడం వల్ల ఉద్యమం ఉదృతి పెరుగుతుందని భయపడుతున్న,
    ఈ చేతకాని సర్కారుకి ...నైతికంగా అనైతికమైన-ఊతాన్ని ఇచ్చినట్లయింది.....

    కొందరి కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటే...

    కొందరి కళ్ళ మంట చళ్ళారి నట్లైంది...

    ఈ బోడి వాదనలంతా మాట ఇవ్వముందు చేసిఊంటే బాగున్ను...
    పిల్లికి గంట కట్టటం ఏలా అని అలోచిం చే ఎలుకల చర్చలా ఉంది.

    ReplyDelete
  2. ఎటువంటి నేరమైనా చేయండి పరవాలేదు మేము తూతూ మంత్రం గా అరెస్ట్ చేసి విడుదల చేస్తాం అని ఎవరూ హామీ ఇవ్వలేదు. అలా ఎవరైనా చెప్పి ఉన్నా అది పబ్బం గడుపు కోవటానికో లేదా చట్టం పట్ల అవగాహన లేకపోవటమే తప్ప అదేమీ శిలాశాసనం కాదు. ఫలానా ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకి మాత్రమే ఈవిధానం పాటించాలి అని జే.పీ. గారు చెప్పలేదు కనుక వాళ్ళు బయటకు వస్తే ఉద్యమం తీవ్రం అవుతుంది అనుకోవటానికి లేదు. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళలో అన్ని ఉద్యమాల వాళ్ళు ఉన్నారు. ఎవడో తెలిసీ తెలియక వాగిన వాగుడుకి చట్టాన్ని అతిక్రమించాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. పైగా ఇప్పుడు కనుకా ఇలా విడుదల చేస్తే భవిష్యత్తులో ఇది ఒక ట్రెండ్ లా మారుతుంది. కనుక ఇది మొలకలా ఉన్నప్పుడే తుంచివేయాలి.

    ReplyDelete