Tuesday, November 30, 2010

ఈ పాపం వై.ఎస్.ఆర్. దే

జగన్ ఏ సభలలోను, సమావేశాలలోను వై.ఎస్.ఆర్. ఫోటో కావాలనే పెట్టటం లేదు అని గొడవ చేస్తున్నాడు. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ పథకానికి రాజీవ్, ఇందిరా తప్ప వేరే పేరు పెట్టాడా? రాజీవ్, ఇందిరలు ప్రధాన మంత్రులు మాత్రమే. ఒకవేళ వాళ్ళు ప్రజలకు ఏదైనా సేవ చేసినా అది ప్రజల సొమ్ముతోనే అని గమనించాలి. కానీ ఏ పార్టీతో కానీ, సామాజిక వర్గంతో గాని, ప్రాంతంతో కానీ సంభందం లేకుండా స్వాతన్త్రోద్యమం లో పాల్గొన్న వాళ్ళు, తరువాత కూడా స్వచ్చందం గా సంఘసేవ చేసినవాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళ పేరు ప్రభుత్వ పధకాలకు ఎందుకు పెట్టకూడదు. కానీ రాజీవ్, ఇందిరాలను మించిన మొనగాళ్ళు ఎవరూ లేరు అని స్వయం గా నమ్మి, అందరి మీద అదే అభిప్రాయాన్ని బలవంతం గా రుద్ది, అధిష్టానం లో కూడా అదే భ్రమ కలిగేలా చేసింది వై.ఎస్.ఆరే కదా. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అని ఇప్పుడు వై.ఎస్.ఆర్. ఫోటో కూడా పెట్టటం లేదు. ఇందులో నాకైతే ఏమీ తప్పు కనిపించటం లేదు.
వై.ఎస్.ఆర్. రాష్ట్రం కోసం ఏదో ఇరగబొడిశాడని ప్రచారం చేస్తున్నారు. కానీ తను స్వలాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టాడు. ఒక్కసారి గమనించండి. వేరే రాష్ట్రాల నుండి ఎంత మంది ఎం.పీ. లు ఎన్నికైనారు, కేంద్రం లో ఎన్ని మంత్రి పదవులు పొందారు, మన రాష్ట్రం పరిస్థితేన్టో. రాష్ట్రం పై పట్టు కోసం కేంద్ర మంత్రి పదవుల కోసం పట్టు పట్టకుండా వదిలి వేసాడని స్పష్టం గా అర్థమవుతుంది. జగన్ నాటకాలకు చెక్ పెట్టటానికి కేంద్రం అతని అక్రమ ఆస్తులపై విచారణ వేస్తుందని నాకు అనిపిస్తుంది.

Saturday, November 27, 2010

26 /11 ... ఆత్మ క్షోభ

26 /11 అప్పుడే ఆ దుర్ఘటనకు 2 సంవత్సరాలు నిండిపోయాయి. నిన్న చిదంబరంగారు అమరవీరులకు అంజలి ఘటిస్తూ పాకిస్తాన్ కి చిత్తసుద్ధి లేదని, ఈ దుర్ఘటనకి బాధ్యులైన వారిని శిక్షిస్తామనిచెప్పి ఇంత వరకు విచారణ కూడా జరపటం లేదని మొసలి కన్నీరు కార్చారు. పాకిస్తాన్ సంగతి వదిలివేయండి. మనం ఒకరిని బందీగా పట్టుకున్నాం కదా.విచారణ కూడా పూర్తై శిక్ష కూడా ఖరారైంది కదా.మరి ఆ శిక్ష ఎప్పటికి అమలు అవుతుందో, దానిని ఆలస్యం చేయటం వెనుక మర్మమేమిటో చెప్పాలి. ఈ సంఘటనకి బాధ్యులైన వారిని శిక్షిన్చేవరకు, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే వరకు మీరు ఎన్ని అంజలిలు ఘటించిన ఆ అమరవీరుల ఆత్మ మరింత క్షోభిస్తుందే తప్ప ఇసుమంతైన శాంతిన్చదు. మీ కల్లబొల్లి మాటలు నమ్మి మాయబోయే వాళ్ళు ఎవరూ లేరు అని తెలుసుకోండి. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటం లో ఎంటువంటి అవకతవకలు జరిగినా ఆ అమరవీరుల కుటుంబాల ఉసురు మీకు తప్పకుండ తగులుతుంది.

ఇదేమి చోద్యం

ఇప్పటి వరకు ఒక వయోవృద్ధుడు ముఖ్యమంత్రి గా ఉన్నాడు. అతను రాష్ట్ర విభజన వంటి సున్నితమైన సమస్యతో, అనేక ఉద్యోగ సంఘాల డిమాండ్ల తో, స్వంత పార్టీలోని గ్రూపులతో సతమతమయ్యాడు. కాని అప్పుడు ఉపముఖ్యమంత్రి అవసరం ఉందని కాంగ్రెస్ కి తోచలేదు. కాని ఇప్పుడు ఒక ప్రాంతం వారినో, వర్గం వారినో సంతృప్తి పరచటానికి కొత్తగా ఉపముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తున్నారు. దీనికి తోడు కొత్తగా కొంతమందికి చోటు కల్పించటం కోసం కొన్ని శాఖలను విడదీస్తున్నారని వినవస్తుంది. దీని వలన పెరిగే ఖర్చంతా ఎవడబ్బ సొమ్మని? ఇకనైనా మంత్రులను కులాలను, ప్రాంతాలను, గ్రూపులను బట్టి కాక అవసరాలను, అర్హతలను దృష్టిలో ఉంచుకొని నియమిస్తే బావుంటుంది.

Friday, November 26, 2010

ఇడిసింది వీధికి పెద్దని

రాఖీ కా ఇన్సాఫ్ ...
ఎంత హాస్యాస్పదం.. ఎంత దౌర్భాగ్యం...
అసలు ఈ ప్రోగ్రాం చెయ్యాలని అందులోనూ రాఖీ తో చెయ్యాలని ఐడియా ఎవడికి వచ్చిందో కాని వాడిని ఏమి చేసినా తప్పులేదు. ఇటీవలే ఒక ఎపిసోడ్ చూసాను. భార్యా భర్తలు తగాదాపడి వచ్చారు. కానీ ప్రోగ్రాం లోనికి రావటం మాత్రం సెలబ్రిటీలలా చెయ్యి ఎత్తి అభివాదం చేస్తూ వచ్చారు.  అందులో రాఖీ ఆ వచ్చినామె చెప్పేది వినిపించుకోకుండా నువ్వు పెళ్లి చూపుల్లో ఎలా సిగ్గు పడ్డావో చూపించ మనటం. ఏమైనా బుర్ర ఉందా అసలు? 
అందుకేనేమో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇడిసింది వీధికి పెద్దని.

Thursday, November 25, 2010

భావి భారత ప్రధానికి? చుక్కెదురు...

బీహార్ ప్రజలు మరలా నితీష్ కుమార్ కి పట్టం కట్టి అభివృద్ధి కన్నా కులం ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. లాలూ భార్యని పోటీ చేసిన రెండు చోట్లా ఓడించి దిమ్మ తిరిగేలా చేశారు. భావి భారత ప్రధానిగా ప్రచారమవుతున్న రాహుల్ గాంధీ "మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి" అంటూ ప్రచారం చేసినా ఏ మాత్రం ఉపయోగం లేక పోయింది. రాజశేఖరరెడ్డి కష్ఠపడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపిస్తే సోనియా గాంధీ ఫోటో పెట్టుకొని గెలిచాడని ప్రచారం చేస్తున్న వాళ్ళు బీహార్ లో సోనియా గాంధీ ఫోటోలకు ఏమి కరువు వచ్చిందో చెప్పాలి. ఏమంటారు?
వేణు బాబు పూరేటి
 

Wednesday, November 24, 2010

చౌకబారుతనానికి ప్రతిరూపం...సాక్షి

నయనతార ఒక సినిమాలో సీత పాత్ర పోషిస్తుందని సాక్షి టీవీ వాళ్ళు తెగ బాధపడి పోతున్నారు. చౌకబారు కథానాయిక సంప్రదాయాలను నాశనం చేస్తుందని ప్రత్యేక కథనాలను ప్రసారం చేసారు. వారికి తెలియదా ఒక హీరోయిన్ సెలక్షన్ లో నిర్మాత, దర్శకుడు మరియు హీరో ముగ్గురూ భాగస్వాములని? కానీ వారి ఊసే ఎత్తలేదు. బహుశా మూతిపళ్ళు రాలగొడతారని భయమేమో!
వాళ్ళు ప్రసారం చేసిన క్లిప్పింగ్స్ ని గమనించినట్లైతే సంప్రదాయాలు మంటగలసి పోతాయనే బాధకన్నా ఈ వంకతో నయనతార నటించిన కాసిన్ని హాట్ సీన్స్ ప్రసారం చేసే అవకాశం దొరికించుకున్నట్లు ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. వాళ్ళకే కనుక నిజంగా సంప్రదాయాలపై అభిమానం ఉంటే మొదట అటువంటి సినిమాలు వచినప్పుడే వాటిపై పోరాటం చేసి సెన్సార్ బోర్డు పై ఒత్తిడి తేవచ్చు కదా? ఇప్పటికే తనకి నైతిక విలువలు లేవని నిరూపించుకున్న సాక్షి ఛానల్ దీనితో తన చౌకబారుతనానికి హద్దేలేదని తేటతెల్లం చేసింది.
సినిమాలకు, ఛానల్సుకు, ఎలాక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు  కనుక సరైన సెన్సారింగ్ ఉంటే మొదట మూతపడేది సాక్షినే అని గుర్తుంచుకోవాలి.

Tuesday, November 16, 2010

వితండవాదం...

తెలంగాణా త్యాగధనుల సభలో రాజశేఖర రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదంటే జగన్ ఓదార్పు యాత్రలో సోనియా ఫోటో ఎందుకు పెట్టలేదని కొంతమంది "సంచలన"కారులు వితండవాదం చేస్తున్నారు. జగన్ మొదట నున్చి కూడా తన యాత్ర వ్యక్తిగతం అని చెబుతున్న సంగతి వారికి తెలియదా?

Monday, November 15, 2010

నిజమైన తెలంగాణా ద్రోహి...

వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణా ద్రోహి అనేవారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు నోరుమూసుకొని ఉన్నారో చెప్పగలరా? 
కెసిఆర్ తెలంగాణా పై తాత్సారం చేయటానికి, ఒక దిశ అంటూ లేకుండా ఉద్యమకారులను గందరగోళ పరచటానికి కారణం ఒకవేళ తెలంగాణా వచ్చినా తనే ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం లేకపోవటం వలనే.
కేకే తో మంతనాలకు కూడా తన ధనదాహమే  కారణం. ఒకవేళ రాష్ట్రం లో ముఖ్యమంత్రిని మార్చి కేకే కి అవకాశం వచ్చినట్లయితే తనకు ఏమి దక్కుతుందో బేరం ఆడటానికే వెళ్లికలిసినట్లు అనుకోవాలి. ఎందుకంటే తనకు ధైర్యం గా ఏదో ఒక పదవి తీసుకునే దమ్ము లేదు కనుక. 
తెలంగాణా వెనుక బడింది. దానిని వేరుచేసి మేము అభివృద్ధి చేస్తాం అనేవాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ కోసం ఎందుకు పట్టుపడుతున్నారో? దానిని వదిలేసి మిగిలిన వెనుకబడిన ప్రాంతాల మీద పూర్తి దృష్టి కేంద్రీకరించావచ్చుగా. బహుశా వాళ్ళ అక్రమ ఆస్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్ లో ఉండటం వలనేమో...
తెలంగాణావాదులమని నిరూపించుకోవటానికి సీమాంధ్ర వారిని విమర్శిన్చటమే మార్గం గా ఎంచుకోవటం మానాలి.

Thursday, November 11, 2010

జై జవాన్.....

గత నాలుగు సంవత్సరాలలో 216 మంది జవానులు ఆత్మహత్య చేసుకున్నారు అన్న వాస్తవం విస్మయాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం వ్యక్తిగత సమస్యలా లేక డిపార్ట్మెంట్ లోని ఒత్తిడులు / వేధింపులా పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

Wednesday, November 10, 2010

టెస్ట్ క్రికెట్ ను బ్రతికించండి.....

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లు చూసిన తరువాత మరలా వాటిపై ఆసక్తి పెరిగింది. టీం ఇండియా నంబర్ 1 స్థానానికి అర్హత ఉన్నదానిలానే కనిపించింది. కానీ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ 5 వ రోజు ఆట చూస్తే ఆ అభిప్రాయం తప్పు అని తేలిపోయింది. మ్యాచ్ డ్రా కావటం వేరు. మ్యాచ్ ని పని కట్టుకొని డ్రా చేయటం వేరు. భారత్ సురక్షిత స్థితిలోకి వచ్చిన తరువాతైనా డిక్లేర్ చేసి ఉండవలసినది.
చివరగా ఈరోజు ఈనాడు పేపర్లో క్రికెట్ సైనికులు అని హెడ్డింగ్ పెట్టటం కొంచెం అతిగా లేదు!

ముఖ్య మంత్రి గారి ఉదార స్వభావం!

నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఫై విమర్శలు చేస్తూ కూడా ఎంతో ఉదార స్వభావాన్ని ప్రదర్శించారు. ఆస్తులపై విచారణ కు సిద్ధమైతే కమిటీ వేసి అక్రమార్జనను నిరుపిస్తామన్నారు. అంటే ఎవరైనా అడిగితే తప్ప వారిపై విచారణ ఉండదా? లేదా ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేయనంతవరకూ ఎవరు ఎంత దోచుకున్నా ఇబ్బందిలేదా? ఒకవేళ విచారణ జరిపి అక్రమార్జన బయట పడితే దానిపై హైకోర్ట్, సుప్రీంకోర్ట్ లకు వెళ్ళకూడదట! అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారికే కోర్ట్ లపై నమ్మకం లేనట్లుంది. హతవిధీ!
ఇదే వాఖ్యానాలను ఒకటికి పది సార్లు ప్రసారం చేసిన మీడియా వారికీ ఈ ప్రశ్నలు ఎందుకు తట్టలేదో? బహుశా సంచలనాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించటం వలనేమో! 

Wednesday, November 3, 2010

దీపావళి శుభాకాంక్షలు

హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు
 
   
 మీ
వేణు బాబు పూరేటి