Wednesday, November 24, 2010

చౌకబారుతనానికి ప్రతిరూపం...సాక్షి

నయనతార ఒక సినిమాలో సీత పాత్ర పోషిస్తుందని సాక్షి టీవీ వాళ్ళు తెగ బాధపడి పోతున్నారు. చౌకబారు కథానాయిక సంప్రదాయాలను నాశనం చేస్తుందని ప్రత్యేక కథనాలను ప్రసారం చేసారు. వారికి తెలియదా ఒక హీరోయిన్ సెలక్షన్ లో నిర్మాత, దర్శకుడు మరియు హీరో ముగ్గురూ భాగస్వాములని? కానీ వారి ఊసే ఎత్తలేదు. బహుశా మూతిపళ్ళు రాలగొడతారని భయమేమో!
వాళ్ళు ప్రసారం చేసిన క్లిప్పింగ్స్ ని గమనించినట్లైతే సంప్రదాయాలు మంటగలసి పోతాయనే బాధకన్నా ఈ వంకతో నయనతార నటించిన కాసిన్ని హాట్ సీన్స్ ప్రసారం చేసే అవకాశం దొరికించుకున్నట్లు ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. వాళ్ళకే కనుక నిజంగా సంప్రదాయాలపై అభిమానం ఉంటే మొదట అటువంటి సినిమాలు వచినప్పుడే వాటిపై పోరాటం చేసి సెన్సార్ బోర్డు పై ఒత్తిడి తేవచ్చు కదా? ఇప్పటికే తనకి నైతిక విలువలు లేవని నిరూపించుకున్న సాక్షి ఛానల్ దీనితో తన చౌకబారుతనానికి హద్దేలేదని తేటతెల్లం చేసింది.
సినిమాలకు, ఛానల్సుకు, ఎలాక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు  కనుక సరైన సెన్సారింగ్ ఉంటే మొదట మూతపడేది సాక్షినే అని గుర్తుంచుకోవాలి.

2 comments:

  1. అయ్యయ్యో మీరు ABN ఛానెల్ ని ఎలా మర్చిపోయారండీ. అసలు ఆ ఛానెల్ బ్రతికేదే సెక్స్ స్కాండల్స్ మీద కదా.
    >>బహుశా మూతిపళ్ళు రాలగొడతారని భయమేమో!

    మీరు మరీను మన మీడియా కి మన "పెద్ద" హీరో ల ని ఏమయినా అనే ధైర్యం ఉందా అసలు. వారినే కాదు "పవర్" ఉన్న ఎవరినీ పల్లెత్తు మాట అనదు మీడియా.

    అయినా ఆవిడ పర్సనల్ విషయాలు పట్టుకుని "సీత" వేషం వెయ్యకూడదంటే ఎలా? అలవోకగా ఇద్దరి మీద కాల్పులు జరిపిన హీరో నా రాముడు మరి?

    ReplyDelete
  2. న్యూస్ ఛానల్స్ తమకి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్న తేడా ఏమిటో అర్థం చేసుకోనంత వరకు ఈ పరిస్థితి తప్పదు.

    ReplyDelete