Saturday, November 27, 2010

ఇదేమి చోద్యం

ఇప్పటి వరకు ఒక వయోవృద్ధుడు ముఖ్యమంత్రి గా ఉన్నాడు. అతను రాష్ట్ర విభజన వంటి సున్నితమైన సమస్యతో, అనేక ఉద్యోగ సంఘాల డిమాండ్ల తో, స్వంత పార్టీలోని గ్రూపులతో సతమతమయ్యాడు. కాని అప్పుడు ఉపముఖ్యమంత్రి అవసరం ఉందని కాంగ్రెస్ కి తోచలేదు. కాని ఇప్పుడు ఒక ప్రాంతం వారినో, వర్గం వారినో సంతృప్తి పరచటానికి కొత్తగా ఉపముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తున్నారు. దీనికి తోడు కొత్తగా కొంతమందికి చోటు కల్పించటం కోసం కొన్ని శాఖలను విడదీస్తున్నారని వినవస్తుంది. దీని వలన పెరిగే ఖర్చంతా ఎవడబ్బ సొమ్మని? ఇకనైనా మంత్రులను కులాలను, ప్రాంతాలను, గ్రూపులను బట్టి కాక అవసరాలను, అర్హతలను దృష్టిలో ఉంచుకొని నియమిస్తే బావుంటుంది.

1 comment: