Friday, December 17, 2010

ఉత్తర కుమారుడు.

నిన్నటి సభలో కే.సి.ఆర్. వాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. భూమిని బద్దలు కొట్టైనా ఆకాశాన్ని చీల్చైనా సరే తెలంగాణాని సాదిస్తాడట. భూమి ఆకాశాలు తెలంగాణా సాధనకు ఎక్కడ అడ్డుపడుతున్నాయో కొంచెం చెప్పరూ? సమస్యకు మూలాలను వెతకకుండా, కార్యాచరణ విధివిధానాలు చర్చించకుండా ఉత్తర కుమారుడిలా డ్రామా డైలాగులతో కాలం గడిపాడు. ఎక్కువగా కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ. లను విమర్శిన్చటమే పనిగా పెట్టుకున్నాడు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాత్రమే ఇస్తుంది దానిపై ఎలాగు వాదోపవాదాలు, చర్చలు జరుగుతాయి, అనుకూలంగా లేకపోతే కోర్ట్ లకు వెళ్ళటం ఎలాగు తప్పదు. అందువలనే నివేదిక వలన వెంటనే ఒరిగేది ఏమీ లేదు. అందుకే డిసెంబర్31 తరువాత తెలంగాణా రాక పోతే జనాల చేతిలో చెప్పు దెబ్బలు తినవలసి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని స్వయంగా డేట్ పొడిగించాడు. తెలంగాణా ఉద్యమ భారాన్ని ఒక్కడే మోసినట్లు ఈ ఉద్యమాన్ని తనచే నడిపించిన ఘనత ప్రజలదేనన్నాడు.
మొత్తం మీద ఈ సభ ఉద్దేశం అందరికి తెలిసిందే. డిసెంబర్ 31  తరువాత తెలంగాణా రాదు అని లోపాయకారిగా చెప్పటం. స్వబలాన్ని అంచనా వేసుకొని తెలంగాణా వస్తే ఒంటరిగా పోటీ చేయాలా లేదా ఎవరితోనైనా పొత్తు పెట్టుకొవాలో అంచనా వేసుకోవటం. దీనికోసం కొన్నిలక్షల మంది ప్రజల విలువైన సమయాన్ని వృధా చేసాడు.

1 comment:

  1. అక్షర సత్యాలు చెప్పారు.

    ReplyDelete