Thursday, December 2, 2010

నిజంగా ఇదంతా ప్రజాసేవ కోసమే?!!!

కొంతమంది మంత్రులు తమకు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వలేదని రాజీనామాకి సిద్ధమవుతున్నారు. ఇది ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం దొరకదనే బాధతోనా లేక ఎక్కువ దోచుకునే అవకాశం దొరకదనే ఆవేదనతోనా? కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రైవేట్ కంపనీ కాదని విమర్శలకు కూడా దిగారు. వారు అన్నది కి.కు.రె. నే అయిన వారి వ్యాఖలు మాత్రం సోనియాను ఉద్దేశించే అని అందరికీ తెలుసు. ఎందుకంటే "అమ్మ" అనుమతి లేకుండా శాఖలు నిర్ణయింపబడవు కదా. కాంగ్రెస్ లో ఎప్పుడైనా మచ్చుకైనా ప్రజాస్వామ్యం ఉందా? ఉమ్మడి అభిప్రాయం అనేది కాంగ్రెస్ లో ఊహకు కూడా అందని విషయం. ఏదైనా అధిష్టానం ఇష్టం, అధిష్టానం నిర్ణయమే  శిరోధార్యం  అంటూ మొత్తం రాష్ట్రాన్ని సోనియా  పాదాల దగ్గర పెట్టి జాతి పరువు మంటగలిపారు. ఇప్పుడు అదే వాళ్ళ వరకు వచ్చేసరికి మింగుడు పడటం లేదు. మంత్రివర్గం లో మార్పులు లేదా ఏదైనా వ్యక్తిగత ప్యాకేజీలు గాని లభించకుంటే నిన్నటి వరకు జగన్ ను విమర్శించిన వీళ్ళే నిర్లజ్జగా తనతో జట్టు కడతారనటం లో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా బాబూ జగనూ నీ రొట్టె విరిగి నేతిలో పడేలా ఉందయ్యా!

1 comment:

  1. >>ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం దొరకదనే బాధతోనా లేక ఎక్కువ దోచుకునే అవకాశం దొరకదనే ఆవేదనతోనా? <<

    నిజంగా మీకు జవాబు తెలియదా ?

    ReplyDelete