Friday, December 24, 2010

ఆత్మహత్య నేరం కానీ హత్య దర్జాగా చెయ్యవచ్చు...

ఎవరైనా ఆత్మహత్యకి ప్రయత్నించినా, సమ్మెలు, దీక్షలు చేసేటపుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా బలవంతంగా హాస్పిటల్ లో చేర్చి చికిత్స చేయిస్తారు. నిన్న చంద్రబాబుకి వైద్యం చేసే బృందం కోర్ట్ ఆదేశాల ప్రకారమే వైద్యం చేశామన్నారు.

ఇచ్చాపూర్వాకంగా ఆహారం తీసుకోక పోవటం ఆత్మహత్యాయత్నం కింద పరిగణించి అరెస్ట్ చేసి వైద్యం చేయిస్తారు. కానీ ఇదే కార్పోరేట్ వైద్యశాలలు ఫీజు తక్కువైనా, కట్టలేకపోయినా వైద్యం చేయటానికి నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. మరివాటిని హత్యల కింద ఎందుకు పరిగణించకూడదు ?.

గిట్టుబాటు అయ్యే జబ్బులను మాత్రమే ఆరోగ్యశ్రీ కింద కార్పోరేట్ వైద్యశాలలు అంగీకరిస్తాయనేది జగమెరిగిన సత్యం.

2 comments:

  1. ' మరివాటిని హత్యల కింద ఎందుకు పరిగణించకూడదు ?. '
    మంచి ప్రశ్న.అది హత్య కింద పరిగణించాలంటే మన చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది.

    ReplyDelete
  2. Very good question.
    It needs to be considered as murder only.

    ReplyDelete