Friday, April 1, 2011

మగాణ్ని ఇబ్బంది పెట్టే విషయాలు...!

మగాణ్ని ఇబ్బంది పెట్టే విషయాలు మచ్చుకు కొన్ని.
  • సెలవులేని రోజు  ఇండియా క్రికెట్ మేచ్ ఉండటం.
  • ఇండియా క్రికెట్ మేచ్ మధ్యలో వర్షం రావటం.
  • శనివారం సాయంత్రం బయలుదేరి ఆఫీసు టూరుపై వెళ్ళవలసి రావటం.
  • వరసగా రెండు, మూడు రోజులు సెలవు వచ్చినప్పుడు  ఫ్రెండ్స్ పేకాటకి రాకుండా ఎగకొట్టటం.
  • రాంగోపాల్ వర్మ ఇంకా సినిమాలు తీస్తూ ఉండటం.
  • పండగకి పుట్టింటికి వెళ్ళని భార్య.
కానీ వీటన్నిటినీ మించినది మరొకటి ఉందంటాడు మా ఏకాంబరం.
అదే గడ్డం లోని తెల్ల వెంట్రుకలు. వీటి వలన అస్సలు బద్దకించటానికే కుదరదు. వారానికోసారి కూడా షేవ్ చెయ్యని మావాడి  చేత రోజూ షేవ్ చేయిస్తాయి.

 



4 comments:

  1. రియల్లీ...? నాకు తెల్లవెంట్రుకలుంటేనే చాలా బాగుంటుందనిపిస్తుంది. ఇంకోరెండేళ్ళు చూసి అప్పటికీరాక పోతే నేనే రంగేసుకును పోదామనుకుంటుంటున్నాను. :D

    ReplyDelete
  2. అంతే అన్నయ్యా,
    రానంత సేపూ వస్తే బావుండనిపిస్తుంది. వచ్చినాక రాకుంటే బావుండనిపిస్తుంది.

    ReplyDelete
  3. 26/11 CINEMA TARUVATA, RAMGOPAL VERMA PAI COMMENT UPASAMHARINCHUKOVATAMAINADI.

    ReplyDelete