Friday, April 8, 2011

"గురు"తుంచుకోవలసిన విషయం

టీమిండియా కోచ్ గేరీ కిర్ స్టన్ పదవి నుంచి తప్పుకున్నాక కొత్త కోచ్ పై ఊహాగానాలు పెరిగాయి. ఇందులో ప్రముఖంగా షేన్ వార్న్, గంగూలీ, అనిల్ కుంబ్లే మరియు ఫ్లెమింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. చివరి ఇద్దరి సంగతి ఏమో కానీ మొదటి ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంచుకున్నా తరువాత చాలా బాధ పడవలసి వస్తుంది.
ఇద్దరూ మంచి ఆటగాళ్లే కావచ్చు. కానీ ప్రతి మంచి ఆటగాడు మంచి కోచ్ కాలేడు. షేన్ వార్న్ డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన సంగతీ, అందరి ఆస్ట్రెలియన్ లానే తన నోటి దూల సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం IPL లో ఆడుతూ సంపాదించుకుంటున్నాడు కాబట్టి నోరు మూసుకున్నాడు కానీ లేకుంటే ఇండియాను విమర్శించకుండా ఉండేవాడా? ఇక తన వివాహేతర సంభందాలు, వివాదాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవి తన వ్యక్తిగతమైతే అవవచ్చుగాక. కానీ కనీస నైతిక విలువలు లేని మనిషి జట్టుని ఒక్కతాటిపై నడిపించగలడా?
వార్న్ తో పోలిస్తే గంగూలీ కొంత నయం, కనీసం బహిరంగంగా తప్పుచేయటానికి భయపడతాడు. తను కెప్టెన్ గా ఉన్నప్పుడు యువకులను ప్రోత్సహించిన మాట నిజమే కానీ తన వల్లనే 2003 వరల్డ్ కప్ టీం లో లక్ష్మన్ బదులు దినేష్ మోంగియాకి స్థానం లభించిందని నా నిశ్చితాభిప్రాయం. పైగా తనని టీం లోనుంచి తీసివేసినప్పుడే బెంగాల్ లో అల్లర్లు చేయిచిన వ్యక్తి కోచ్ అయితే తన మాట నెగ్గించుకోవటానికి ఏమి చేస్తాడో చెప్పలేం కదా!
చాంపియన్ కావటం ఎంత కష్టమో ఆ హోదా నిలబెట్టుకోవటం అంతకు మించి కష్టం. కాబట్టి ఇగో లేనివాణ్ణి, టీం అవసరాలు గుర్తించి, సమైఖ్యంగా ఉంచగలిగేవాణ్ని మాత్రమే కోచ్ గా తీసుకురావాలి.

1 comment:

  1. గురు బ్రహ్మా గురుర్విష్ణుః
    గురుర్ధేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరంబ్రహ్మ
    తస్మై శ్రీ గురవేనమః

    గురు దేవులు గ్యారీక్రిస్టెన్ గారికి సాస్టాంగ ప్రణామాలతో..

    మీ

    స్వామి(కేశవ)



    (చక్ దే ఇండియా .. అన్న ప్రతీ ఒక్క భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన పేరు ..
    వరల్డ్ కప్ ని ఇండియా కి తెచ్చిపెట్టిన హీరో మన కోచ్ గ్యారీ .. )

    గ్యారీ హ్యాట్సాఫ్ టు యు .. & వుయ్ మిస్ యు ..

    ReplyDelete