కొన్నాళ్ళ క్రితం సంతూర్ ఏడ్ వచ్చేది. ఒకామె ఎక్సర్సైజ్ చేసి వస్తుండగా వేరే ఒకరు పలకరిస్తారు "ఎక్స్ క్యుజ్ మీ, మీరు ఏ కాలేజ్" అని. ఈ లోగా ఓ పాప వస్తుంది "మమ్మీ" అనుకుంటూ. ఈ ఏడ్ ఎంత పాపులర్ అయిందంటే మా కాలేజ్ రాగింగ్ లో పాటలకు డాన్స్ వేయించే బదులు ఈ ఏడ్ మా చేత ప్రదర్శింప చేసేవారు. ఇప్పటికీ సంతూర్ వాళ్ళు ఆ "మమ్మీ" కాన్సెప్ట్ నుంచి బయట పడలేక పోతున్నారు. ప్రస్తుతం సంతూర్ ఏడ్ లో ఒకామె జనాన్ని నెట్టుకుంటూ మెట్లు ఎక్కుతుంది (ఏ మాత్రం సెన్స్ లేకుండా). వాళ్ళే తన గదిలోకి వస్తారు. కనీసం కూర్చోమని కూడా అనకుండా (ఎంత పెద్ద పదవిలో ఉన్నా తనకు అసలు మర్యాద అనే పదానికి అర్థమే తెలియనట్లు) డైరెక్ట్ గా విషయం లోకి వచ్చేస్తుంది. ఈలోగా ఓపాప మళ్లీ "మమ్మీ" అనుకుంటూ ఎంటరైపోతుంది.(ఏ మీటింగ్ జరుగుతుంటే మాత్రం తనకేం, ముందే చెప్పుకున్నాం కదా మర్యాద అనే మాట మన డిక్షనరీ లోనే లేదని). ఇవన్నీ చూపించాలంటే 3 గంటల సమయం కావాలని వాదించే వాళ్ళు ఉండవచ్చు. కానీ సంతూర్ వాళ్ళు "మమ్మీ" మత్తు లోనుంచి బయటకు వస్తే ఇంకా మంచి కాన్సెప్ట్ మంచి ఏడ్ తీయవచ్చు.
ప్రస్తుతం జగన్ పనులు కూడా అలానే ఉన్నాయి. వై.ఎస్.ఆర్. చనిపోయినపుడు ఆత్మహత్య చేసుకున్న, బాధతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని జగన్ అన్నప్పుడు చాలా మంచి నిర్ణయం అనిపించింది. కానీ వాస్తవం లో అది ఒక ప్రహసనం గా మారింది. పైగా కాంగెస్ ప్రకటించిన సంఖ్యకి, జగన్ సంఖ్యకి సంబందమే లేదు. పైగా ఓదార్పుయాత్రకి వచ్చే జనానికి తలకి 50 రూపాయలు ఇస్తున్నారనే విషయం బయటకు రావటం తో యాత్ర తేలిపోయింది. (కానీ ఈవిధంగా ప్రజలకు ఆదాయం చేకూరుతున్నందుకు సంతోషం గా ఉంది) ఓదార్చే కుటుంబాల కన్నా ఆవిష్కరించే విగ్రహాల సంఖ్య ఎక్కువ కావటం, జగన్ "డాడీ" కాన్సెప్ట్ నుంచి బయటకు రాకుండా, మొక్కుబడిగా 2 రోజులు రైతుల కోసం దీక్ష చేసి "డాడీ" ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కాంగ్రెస్ పై విమర్శలతోనే కాలం వెళ్ళబుచ్చటం, తనకు తానుగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవటం చాలా హాస్యాస్పదం గా ఉన్నాయి. జగన్ వాస్తవం లో జీవించటం నేర్చుకోకపోతే ముఖ్యమంత్రి కావటం అలా ఉంచి తను గెలవటం కూడా అనుమానంగా మారుతుంది.
very true, he and his guides have to change the concepts. otherwise another PRP in AP politics.
ReplyDeleteఅయ్యా ఎడిటర్ గారు మీరు ఫాంట్ కలర్ మారిస్తే మేము కష్టపడాకుండా చదువుకుంటాము,,,
ReplyDeleteఅసలు ఏమి కనిపించట్లా బ్లాంక్ గా ఉండి, may be నా బ్రౌజరు లేదా మీ font style ప్రోబ్లేమో మరి, ctrl + A నొక్కితే కాని కనపల్ల్ల text
అంతే కాదు, పక్కన మా రాకకై వేచి ఉన్న post లు అదే "మీ రాకకై వేచిన వీటిని కూడా చూడండి" label కింద postలకు comment option లేదు దయచేసి అదేంటో చుస్తే మేము కామెంటుతాము.....
by the way బేను, వేణు సారీ వెన్హు అయ్యో.... తెలుగులో మీ పెరోంతో రాసి పెట్టండయ్య... venhu అని టైపు చేస్తే వెంహు అని వస్తోంది మరి.... :p
(మీ మనోబావాలు ఏమైనా దెబ్బతింటే క్షమించగలరు.... ఏదో కుర్రాలము చూసి చూడక వోదిలేయండి, లేదంటే comment delete చేయండి... =D)