నిన్న మాకొలీగ్ తో పాటు సరుకులు (వెచ్చాలు) కొనటానికి వెళ్లాను. అక్కడ మేము వెళ్ళేసరికే కొంతమంది సరుకులు కొంటున్నారు. వాళ్ళు వెళ్ళిన తరువాత మావాడు సరుకులు, కూరగాయలు తీసుకొని ఖాతాపుస్తకంలో వ్రాయించుకున్న తరువాత వచ్చేశాం. మిగిలిన వాళ్ళ కన్నా మావాడికి తక్కువ రేటు వేయటం గమనించి విషయమేమిటని అడిగాను.
మావాడు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న నాలుగైదు షాపులలో రెక్కీ నిర్వహించి ఈషాపు ఎంచుకున్నాడు. ఒకానొక శుభముహూర్తాన షాపు రద్దీగా ఉన్నప్పుడు వెళ్లి ఏవేవో కొని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు 35రూపాయలు పోనూ మిగిలిన 65రూపాయలు తిరిగి ఇచ్చేసారు. మనవాడు ఒక చిరుదరహాసం చేసి "రేపటి నుండి మీ షాపుకే వస్తాను, నేను 50రూపాయలు ఇస్తే సరుకులు ఇచ్చి మరీ 65రూపాయలు చిల్లర ఇచ్చే మరోషాపు దొరకదంటూ" 50రూపాయలు తిరిగి ఇచ్చేసాడు. (నిజానికి మనవాడు ఇచ్చింది 100 రూపాయలే). ఆవిధంగా 50రూపాయలు రిస్క్ చేసి మనవాడు వాళ్ళ దృష్టిలో రాముడు మంచి బాలుడు అన్నట్లు ముద్ర పడిపోయాడు. పైగా ఇక్కడి వాళ్లకు తెలుగువాళ్ళు అంటే సాఫ్ట్ కార్నర్, దానికి తోడు మనవాడు కూడా స్వామి లాగానే అందరినీ అక్క, అన్నా అంటూ అల్లుకు పోతాడు. ఒకటో తారీఖే SBI ATM లో నుంచి తీసిన కొత్త నోట్లతో బాకీ తీర్చేస్తాడాయే. అలా గత ఒకటిన్నర సంవత్సరాల నుండి ప్రతిదాంట్లో రూపాయి రెండు రూపాయలు చొప్పున లబ్ది పొందుతూనే ఉన్నాడు. మనవాడు వాళ్ళను ఏవిధంగాను మోసం చెయ్యలేదు కనుక ఇది తప్పాఒప్పా, నైతికమా అనైతికమా తేల్చుకోలేక పోయాను కానీ వాడి (అతి) తెలివితేటలను మాత్రం మెచ్చుకోక తప్పలేదు.
మీరు కూడా ఈ అద్భుతమైన (పనికిమాలిన) చిట్కాని పాటించి లాభం పొందగలరు.
షరా: ఎవరన్నా దుకాణదారులు (షాప్ కీపర్స్) కనుక ఈ టపా చదివి ఉంటే వెంటనే మరచిపొమ్మని మన్నవి.

No comments:
Post a Comment