Wednesday, February 9, 2011

శంకర్ దాదా B. Tech

శంకర్ దాదా సినిమాలో పేషెంట్లను స్వంత మనుషులులా భావిస్తే వైద్యం చేయలేమని చెప్పే సన్నివేశముంది. తరువాత అది తప్పని నిరూపిస్తారనుకొండి. ఇలా భావించే డాక్టర్లే కాదు, ప్రాజక్ట్ మేనేజర్లు కూడా ఉంటారు. ఎంత సేపు ఎంత టార్గెట్, ఎచీవ్మెంట్ ఎంత అనే తప్పితే వీరి నోటి  వెంట మరో మాటే రాదు. ఖర్మకాలి వీళ్ళతో కలిసి భోజనం చేయవలసి వచ్చినా, ఎక్కడికన్నా వెళ్ళ వలసి వచ్చినా ఇఖ చూసుకోండి, నరకమే. వర్క్ గురించే మాట్లాడుతారు తప్పితే మరో మాటే ఉండదు. ఏమన్నా వ్యక్తిగత విషయాలు చర్చిస్తే చంకనెక్కుతారని భయమేమో కానీ చాలా మందిది ఇదే పద్ధతి.

మా దగ్గర పనిచేసే ఒక సీనియర్ ఇంజినీర్ రాజీనామా చేసినప్పుడు కారణం అడిగితే ఈవిధంగా చెప్పాడు. "మన దగ్గర కాంట్రాక్టర్ పనిచేస్తుంటే ఫర్లేదు, కానీ డిపార్ట్మెంటల్ లేబర్ పనిచేస్తుంటే ఉదయాన్నే 8 గంటలకల్లా సైట్ కి వెళ్ళాలి, క్లైంట్ తో మాట్లాడాలి. సాయంత్రం వరకు ROW ప్రాబ్లమ్స్ తీర్చుకుంటూ పని చేయించాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక కూడా ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ, వోచర్లు రాసుకుంటూ కూర్చోవాలి. మా ఇంట్లో వాళ్ళు "నువ్వు కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నావా లేక ఎవరన్నా కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రిగా పని చేస్తున్నావా" అని అడుగుతున్నారు. పైగా ఒక్కరూపాయి తేడా లేకుండా వ్రాసినా కూడా అకౌంటెంట్ దొంగలను చూసినట్లు చూసే చూపులను భరించాలి. కారణాలతో సంభందం లేకుండా అచీవ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడే బాసుల దగ్గర తిట్లు తినాలి. ఆదివారం కూడా సెలవు తీసుకోవటానికి వీలులేని జీవితం సార్. నావల్ల  ఎవరూ తృప్తిగా లేనప్పుడు నేను ఎందుకు పని చేస్తున్నానో, ఎవరికోసం పని చేస్తున్నానో అర్థం కావటం లేదు. ఇక్కడ ఉండి పిచ్చివాడిని అయ్యేకంటే వెళ్లిపోవటమే నయమని వెళ్ళిపోతున్నాను"  అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఈ ఒక్క సంఘటనే కాదు, ప్రాజెక్ట్ లలో పనిచేసేవాళ్ళని చాలామందిని గమనించాను. కొంతమంది ఎక్కువ జీతం వస్తుందనో, ప్రమోషన్ కోసమో లేక వ్యక్తిగత కారణాల వలనో మానేసినా ఎక్కువమంది మాత్రం గుర్తింపు దొరకక పోవటం, మానసిక ఒత్తిళ్ళు వలనే మానేశారు. 
క్లైంట్ ఎంత  అడ్డదిడ్డంగా మాట్లాడినా చిరునవ్వుతో వినే మేనేజర్ తన క్రింద ఉద్యోగి చెప్పేది వినటానికి కూడా అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఎందుకని? అందుకే నాకు అనిపిస్తుంది "ఒక మేనేజర్ కి  టెక్నికల్ గానో, క్లైంట్ డీలింగ్ లోనో ప్రావీణ్యం ఉంటే సరిపోదు. తన దగ్గర పనిచేసేవారి సాదకబాధకాలు కూడా అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి."

4 comments:

  1. మీరేం చేస్తుంటారో తెలీదుగానీ. ఖచ్చితంగా software వుద్యోగులుకూడా ఇలానే ఫీలవుతుంటారు. మా పాతమేనేజరొకాయన ఆయన పక్కన కూర్చుంటే ఇక వుపన్యాసం అదేపనిగా దంచుతుంటాడు. ఒక సారి భరించలేక అనేశాను "వుపన్యాసాన్ని భరించే ఓపిక ఈరోజు నాకు లేదు నేను దూరంగా ఇంకెక్కడైనా కూర్చుంటాను" అని.

    "క్లైంట్ ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడినా చిరునవ్వుతో వినే మేనేజర్ తన క్రింద ఉద్యోగి చెప్పేది వినటానికి కూడా అసహనాన్ని"
    good question.

    "ఒక మేనేజర్ కి టెక్నికల్ గానో, క్లైంట్ డీలింగ్ లోనో ప్రావీణ్యం ఉంటే సరిపోదు. తన దగ్గర పనిచేసేవారి సాదకబాధకాలు కూడా అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి"
    నిజం. కానీ మేనేజర్‌కి techincak knowledge కూడా వుండాలి లేకుంటే మనం స్కూలు పిల్లకాయలకి చెప్పినట్టు సమస్యని గంటలు గంటలు వివరించాల్సొస్తుంది. "ఇలాంటి బడుధ్ధాయి నా మేనేజరేంటి?" అని నా ఈగో నన్ను చంపుకుతింటుందికూడా.

    ReplyDelete
  2. "ఇలాంటి బడుధ్ధాయి నా మేనేజరేంటి?"
    ఏదో సినిమాలో ధర్మవరు డైలాగ్ గుర్తుందా "క్రమక్రమంగా తెలివితేటలు తగ్గించుకొని మేమూ అవుతాము బాబు ప్రిన్సిపాలు" అని.
    కొంత మంది మేనేజర్లను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

    ReplyDelete
  3. I don't agree with this. Is that Company is the manager's company? He is also an employee and will have a manager as well. How many times employees do recognize their managers for their (good) work? Don't tell me he never did (good) work, otherwise by now he would have been out of work anyways ;)

    This is showing only one side of the coin :)

    ReplyDelete
  4. @anonymous
    amdaru menejarlu anni ssarlu tappu chestaarani cheppatam naa uddhesam kaadu. employee ee vishayam lo ekkuva hurt avutaado cheppataaniki oka uddaharana icchanamte.

    Is that Company is the manager's company?

    meeru emi chestumtaaro teliyadu kaanamdee, Transmission & Distribution (Eledctrical) Projects lo site lo umde Project Manager srvaadhikaari.

    He is also an employee and will have a manager as well.

    manager emta work chessaadu anedi kaadu vishayam, oka employee chesina daaniki gurtimpu ivvatam chaalaa avasaram ani cheppadalachukunnaanamte. tanapai manager numchi tanu koodaa ade expect chestumdi umtaadu kadaa.

    ReplyDelete