ప్రేమికుల రోజు ఆడా మగా కలిసి బయట తిరిగితే పెళ్లి చేస్తామనే సాంప్రదాయవాదులారా,
పెళ్ళికి ముందే కలిసి (విచ్చలవిడిగా) తిరగటం మన సాంప్రదాయం కాదు. కరక్టే. దానిని అడ్డుకోవటానికి మీరు మీమీ పనులు మానుకొని మరీ, జంటలను ఆపి, విచారించి, కౌన్సెలింగ్ చేసి వాళ్ళ పెద్దవాళ్ళ తో మాట్లాడి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బృహత్ కార్యక్రమాన్ని తమ భుజ స్కందాలపై వేసుకున్నారు.
కానీ అయ్యలారా, తల్లిదండ్రులను సరిగా చూసుకోవలసిన బాధ్యత పిల్లలదే కదా. అది మన సంస్కృతి లో భాగమే కదా. ఏ న్యూ ఇయర్ రోజో (మామూలు రోజుల్లో అయినా అభ్యంతరం లేదు) ఒక్కొక్కళ్ళని ఆపి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమగా (కనీసం బాధ్యతగా) చూసుకుంటున్నారో లేదో విచారించి, అలా చూసుకోని వారికి కౌన్సెలింగ్ నిర్వహించొచ్చు కదా. తెలిసో బలిసో తిరిగే వాళ్ళ పై చూపే శ్రద్ధ, నిజంగా అవసరమైన వాళ్ళపైకి మరల్చవచ్చు కదా.
ఓ మానవ హక్కుల పరిరక్షకులారా,
ఒక్క రోజు అదుపులో ఉండమంటేనే ఇంత విలవిలలాడి పోతున్నారే, కొన్ని మతాలలో స్త్రీలు జీవితాంతం ధరించే దుస్తులపై ఆంక్షలు విధిస్తున్నప్పుడు మీ గొంతు పెగలదేం? స్త్రీలు ఉద్యోగం చేయటం పైనా, మొబైల్ ఫోన్ వాడటం పైన కూడా ఆంక్షలు విదిస్తున్నారే! అప్పుడెందుకు కలుగుల్లో ఎలుకల్లా ఉండిపోతారు?
ఓ రక్షక భటులారా,
పార్కుల వద్ద రక్షణ కల్పిస్తామంటు ముందుకొచ్చిన మీ విశాల హృదయానికి జోహార్లు. వరుస అత్యాచార ఘటనల తరువాత కూడా రాత్రి పహారాను పెంచటం లో రియాక్ట్ అవ్వరేం?
ఓ మీడియా మిత్రులారా,
ప్రేమికుల రోజు కి పదిరోజుల ముందు నుంచే హడావిడి మొదలెట్టి, తీరా ముందు రోజు ఓ నలుగురిని కూర్చోపెట్టి చర్చలు నిర్వహిస్తారే? ఇదేమన్నా న్యాయమా?

chalabaga rasaru....
ReplyDeletesuper
ReplyDeleteexcellent
ReplyDelete