ప్రెషర్ కుక్కర్ మూత తీయటం ఎలా అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ చాలాకి అందరికీ మధ్య చాలా తేడా ఉండనే విషయం గత వారం మా కొలీగ్ కుక్కర్ మూత బలవంతం గా తీసి ముఖం కాల్చుకున్నప్పుడే అర్థం అయింది. అతనిని హాస్పిటల్ లో చేర్పించిన తరువాత కుక్కర్ గురించి మా మిత్రబృందం మధ్య జరిగిన చర్చ సారాశం వ్రాస్తున్నాను.
1. కుక్కర్ సామర్ధ్యాన్ని మించి అందులో పదార్థాలు వేయరాదు.
2. గేస్కేట్ ఖచ్చితంగా పెట్టవలెను.
3. వండే పదార్థాన్ని బట్టి ఎన్ని నీళ్ళు పోయాలి, ఎన్ని విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి మొదలైనవి తెలుసుకొని వంట చేయాలి తప్పితే ప్రయోగాలు చేయరాదు.
4. స్టవ్ ఆపిన తరువాత ప్రెషర్ అంతా పోయిందని నిర్థారించుకున్న తరువాత లేదా రిలీజ్ చేసిన తరువాత మాత్రమే మూత తీయాలి.
కనుక ఫ్రెండ్స్ (ముఖ్యంగా స్వయంపాకం చేసుకునే మగ మిత్రులారా) తస్మాత్ జాగ్రత

అవును. నాకూ తెలీదు. ఒకసారి మా ఆవిడ, మా అమ్మాయితో సహా ఊరెళితూ కూరలన్నీ చేసిపెట్టి కుక్కర్ లో బియ్యం పెట్టి అన్నం తినాలనుకునేముందు స్టవ్ వెలిగించుకోమని, మూడు విజిల్స్ తర్వాత కొద్దిసేపు ఆగి మూత తీసుకుని వడ్డించుకోమని చెప్పి వెళ్ళింది. మూడు విజిల్స్ అయిన తర్వాత మూత తీద్దామని ప్రయత్నిస్తే అది రాలేదు. మీ ఫ్రెండ్ లాగానే బలవంతంగా లాగితే అది ఫట్ మని లేచి పడింది. అయితే అదృష్టవశాత్తూ నాకు ముఖం కాలలేదులెండి. సగం అన్నం బయటకొచ్చి బయటంతా పడింది. ఆ మిగిలిన అన్నంతోనే ఆత్మారాముడిని సంతృప్తి పరిచాను.
ReplyDeleteBhale cheppare.
ReplyDeleteవాళ్ళెవరో తెలుకోవచ్చా
ReplyDeleteaha yemi chepparandi...
ReplyDeletehttp://telugutelevisionmedia.blogspot.com/
@ హేమంత్
ReplyDeleteఅలా పేర్లు చెప్పరండి. మీరు T.V. లో వార్తలు (స్క్రోలింగ్స్) చూడరా? హైదరాబాద్ లోని ఒక కెమికల్ కంపనీలో బాయిలర్ పేలి ముగ్గురు మరణించారు, పదిమందికి గాయాలు అయ్యాయి అంటారు తప్పితే కంపనీ పేరు వ్రాయరు. దీని వలన హైదరాబాద్ లో ఎన్ని కెమికల్ కంపనీలు ఉన్నాయో అన్నిట్లో పనిచేసే వాళ్ళ బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళన పడాలి. కంపనీ పేరు అంత రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాదు.
పేరు వ్రాసి జనాలను ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక వ్రాయలేదండి.
aha yemi cheparamdi thanks for your detailed information kusinta jagatra mari tisetappudu
ReplyDeletewater pump kinda cooker ni pedite lopala unna pressure anta potundi ventanee open cheyavachu
ReplyDelete