Monday, January 10, 2011
ప్చ్... సెలవు దొరకలేదు.
దీపావళి వచ్చి వెళ్ళిన దగ్గరి నుండి సంక్రాంతి కోసంఎదురు చూస్తున్నాను. మా నార్త్ ఇండియా కొలీగ్స్ అందరూ దీపావళి సెలవలకు వెళుతుంటే చెప్పాను "పొండిరా పొండి, నేను సంక్రాంతి వెళతాను" అని. నెల రోజుల ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకున్నాను. నెలాఖరు ఒత్తిళ్ళు, నెల మొదట్లో ఉంటే ప్లానింగ్ లు అన్నీ అయిపోతాయీ, సెలవు ఖచ్చితంగా దొరుకు తుందని ఎంతో ధైర్యంగా ఉన్నాను. కానీ మా బాసాసురుడు Q1 & Q2 లో కూడా మన పెర్ఫామెన్స్ బాలేదు, Q3 లో ఎవరికీ సెలవలు లేవు అని చెప్పి నా నెత్తిపై పెద్ద బండ వేసాడు. నెలరోజుల ముందునుంచి బ్యాగులు సర్దుకు కూర్చున్న మా హోం మినిస్టర్ ఎలా అర్థమయ్యేలా / సర్ది చెప్పను!?
Subscribe to:
Post Comments (Atom)
Enta kashtam vachchindandi.mallee sudden gaa selavu istademo choodandi.
ReplyDeleteఅయ్యయ్యో ప్చ్ ..ఎలాగండీ
ReplyDeleteవా., వా ,, వా ..
ReplyDeleteనాది కూడా సేమ్ కదా ..
సెలవూ పోయే పని వచ్చె టాం టాం టాం ..
రిజర్వేషన్ కేన్సిల్ చేసినా సగం డబ్బులే వచ్చె డాం డాం డాం..
నేనైతే మా వాళ్ళందరికీ " మన కాలేజీ గ్రౌండ్ లోనే నేషనల్ లెవెల్ గేమ్స్ స్టార్ట్ అవుతాయ్ కాబట్టి , ఎవడు మిస్ కాకుండా రావాలి , ఎవడు మిస్ అయినా వాడి జట్టు పచ్చి " అని చెప్పాను. ఇప్పుడు నా సెలవే పల్టీలు కొట్టింది.
మా ఊరి హరిదాసు కీర్తనల దగ్గరనుంచి , భోగి కబుర్లు , సంక్రాంతి సరదాలు ( కోడి పందాలు , కబడ్డీ ఆటలు , గాలి పటాలు , అర్దరాత్రి ఆర్కెస్ట్రా లు , కొత్త పేట ప్రభల తీర్ధం ) మొత్తం అంతా exclusive లైవ్ అప్డేట్స్ , నా బ్లాగ్ ద్వారా మీ అందరికీ అందిద్దాం అనుకున్నాను.
ప్చ్ ఏం చేస్తాం . ఇట్స్ గాన్.. మై లీవ్ ఈజ్ గాన్ ..
ప్లేన్ మొత్తం ఒక్క మెయిల్ తో మన వాళ్ళు తలకిందులు చేసేసారు .
ఇట్స్ వెరీ సేడ్ కదా ..
మా తమ్ముడైతే పండక్కి రాకపో, నిన్ను ఏం చేస్తానో చూడు అని నాకు భారీ సైజు వార్నింగ్ ఇచ్చేసాడు ..
god whaat to do .. ?
అయ్యో పాపం బాసాసురుడు శలవు ఇవ్వనన్నాడా. ధైర్యం చేసి, వాడి కుర్చీ తీసుకెళ్లి భోగిమంటలో వేసేయండి.
ReplyDeleteపాపం స్వామి (కేశవ) గారు కూడా చాలా కష్టంలో ఉన్నారు. వారికి కూడా మా సానుభూతి.
మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.