తనని మొదటిసారి చూసిన ఓ నెలలోపే ప్రేమలేఖ రాయాలనే కోరిక ఏకంబరంలోకలిగింది. ఇంకో నెల గడిచేసరికి అది అణుకుచుకోలేని స్థాయికి చేరుకుంది. అయినా చాన్నాళ్ళు రాయలేదంటే పెన్నో పేపరో లేక కాదు, ధైర్యం లేక! కానీ రాయకుండా ఉండలేకపోయాడు. ఏమిటీ, అది నిజంగా మొదటి ప్రేమలేఖేనా అంటారా? నిజంగా నిజం, మొదటిదే. (తను ఇంతకు ముందు ఎవరికీ లేఖలు రాయలేదు, అన్నీ స్లిప్పులే! అందుకేనేమో అందరూ స్లిప్పయిపోయారు.) అయినా తనకు వాడు రాసిన మొదటి లేఖ ఇదే కదా. ప్రేమ గురించి ముఖాముఖి చెప్పు, లేఖలు రాస్తే ఇరుక్కున్టావ్ అని శీను హెచ్చరిస్తున్నా "సీతయ్య"లా తన మాట వినిపించుకోకుండా రాశాడు.
ప్రేమలేఖ రాయటంకన్నా కష్టమైన పని ఇంకోటి కనిపించింది. అదే ప్రేమలేఖ ఇవ్వటం! ఎవరన్న ఊహ తెలియని పిల్లల చేత పంపిస్తే ఎవరికిస్తారో అని భయం, తెలిసిన పిల్లలకిస్తే అందరికీ చెబుతారేమోననే భయంతో ఆఖరికి వాడు "తెనాలి" లో కమల్ హాసన్ లా అన్నిటికీ భయపడటం మొదలుపెట్టాడు. ఆభయంలో వాడికి "తను అమ్మాయిగా ఆమె అబ్బాయిగా పుట్టుంటే ఎంత బావుండేదో!" లాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చేవి. అప్పుడయితే తను చెప్పేంత వరకు హాయిగా ఎదురు చూసేవాడిని అంటుండేవాడు. లేదా మొదట చెప్పాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి హేంగర్ కి ఉండే తన చొక్కా జేబులో ఉత్తరం పెట్టేవాడట. ఆమెకేమో హ్యాండ్ బాగ్ వాడే అలవాటు లేదాయే. ఏమిచేస్తాడు పాపం. లేదా ఎప్పటిలా ఓ చిన్న స్లిప్పయి ఉంటే ఏ KIT KAT చాక్లెట్లోనో పెట్టి ఇచ్చేవాడు. అంత ఉత్తరంతో ఆఅవకాశమూ పోయింది. అందుకే ధైర్యం చేసి డైరెక్ట్గా వాడే ఇస్తానంటున్నాడు. అది ఎప్పటికి జరిగేనో?
ఏదోవొక వంకతో రోజూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లడకపోతే ఆరోజంతా అదోలా ఉంటుందట. ఊహు, మాట్లాడాలనుకుంటాడు, కానీ తన కబుర్లు వినటమే వాడికిష్టం. మేము కలిసినప్పుడల్లా తనని కలసినప్పుడు ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో తెగ సోది చెప్తాడు, కానీ తను పక్కన ఉంటే మాత్రం నీళ్ళు నముల్తాడు. తనఫోన్ నంబర్ అడగటానికే ఎంత ఆలోచించాడో తెలుసా? అదృష్టవశాత్తు ఆంటీ వాళ్ళ అమ్మతో మాట్లాడటం కోసం తన నంబర్ కి ఫోన్ చేయటంతో ఆసమస్య తీరిపోయింది, కాదు కాదు మొదలయింది. ఫోన్ చెయ్యాలా, వద్దా? చేస్తే ఏమి మాట్లాడాలి, లేదా "ఎందుకు ఫోన్ చేసావ్" అంటే ఏమి చెప్పాలి?. దీనికీ హేమంత్ ఓ ఉపాయం ఆలోచించాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏదో పని ఉన్నవాడిలా వాడు వెళ్ళిపోతూ "పనుంది వెళ్ళాలి, సాయంత్రం ఫోన్ చేస్తాను" అని చెప్పాలి. మాటల సందట్లో తను "సరే" అంటుంది.
ఓవారం టైం తీసుకున్నా అంతా హేమంత్ అనుకున్నట్లే జరిగింది. నిజం చెప్పొద్దు, వాడు మొదటి సారి ఫోన్ చేసినప్పుడు అరచేతుల్లో చెమటలు పట్టాయంటే నమ్మండి. "గుండెలలో వీణలు మోగాయి" అని పుస్తకాలలో రాస్తారు చూడండి, అలానే తనతో ఫోన్ మాట్లాడాక వాడి గుండెలలో మోగిన వీణలు వాడు తిరిగిన మెలికల రూపంలో మాకు బయటకు వినిపించాయి (కనిపించాయి).
ha ...haaa
ReplyDeleteమీ ఈ para మొత్తం complete చేయకుండానే వదిలేసినట్టుగా ఉన్నారే...
ReplyDeleteమాస్టారు టిఫిన్ చేఇంచి లంచ్ ఆపేశారు, కుదిర్తే డిన్నర్ కూడా చేస్తాం....ఏమంటారు... :p