కెసిఆర్ తెలంగాణా పై తాత్సారం చేయటానికి, ఒక దిశ అంటూ లేకుండా ఉద్యమకారులను గందరగోళ పరచటానికి కారణం ఒకవేళ తెలంగాణా వచ్చినా తనే ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం లేకపోవటం వలనే.
కేకే తో మంతనాలకు కూడా తన ధనదాహమే కారణం. ఒకవేళ రాష్ట్రం లో ముఖ్యమంత్రిని మార్చి కేకే కి అవకాశం వచ్చినట్లయితే తనకు ఏమి దక్కుతుందో బేరం ఆడటానికే వెళ్లికలిసినట్లు అనుకోవాలి. ఎందుకంటే తనకు ధైర్యం గా ఏదో ఒక పదవి తీసుకునే దమ్ము లేదు కనుక.
తెలంగాణా వెనుక బడింది. దానిని వేరుచేసి మేము అభివృద్ధి చేస్తాం అనేవాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ కోసం ఎందుకు పట్టుపడుతున్నారో? దానిని వదిలేసి మిగిలిన వెనుకబడిన ప్రాంతాల మీద పూర్తి దృష్టి కేంద్రీకరించావచ్చుగా. బహుశా వాళ్ళ అక్రమ ఆస్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్ లో ఉండటం వలనేమో...
తెలంగాణావాదులమని నిరూపించుకోవటానికి సీమాంధ్ర వారిని విమర్శిన్చటమే మార్గం గా ఎంచుకోవటం మానాలి.
No comments:
Post a Comment