జగన్ ఏ సభలలోను, సమావేశాలలోను వై.ఎస్.ఆర్. ఫోటో కావాలనే పెట్టటం లేదు అని గొడవ చేస్తున్నాడు. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ పథకానికి రాజీవ్, ఇందిరా తప్ప వేరే పేరు పెట్టాడా? రాజీవ్, ఇందిరలు ప్రధాన మంత్రులు మాత్రమే. ఒకవేళ వాళ్ళు ప్రజలకు ఏదైనా సేవ చేసినా అది ప్రజల సొమ్ముతోనే అని గమనించాలి. కానీ ఏ పార్టీతో కానీ, సామాజిక వర్గంతో గాని, ప్రాంతంతో కానీ సంభందం లేకుండా స్వాతన్త్రోద్యమం లో పాల్గొన్న వాళ్ళు, తరువాత కూడా స్వచ్చందం గా సంఘసేవ చేసినవాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళ పేరు ప్రభుత్వ పధకాలకు ఎందుకు పెట్టకూడదు. కానీ రాజీవ్, ఇందిరాలను మించిన మొనగాళ్ళు ఎవరూ లేరు అని స్వయం గా నమ్మి, అందరి మీద అదే అభిప్రాయాన్ని బలవంతం గా రుద్ది, అధిష్టానం లో కూడా అదే భ్రమ కలిగేలా చేసింది వై.ఎస్.ఆరే కదా. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అని ఇప్పుడు వై.ఎస్.ఆర్. ఫోటో కూడా పెట్టటం లేదు. ఇందులో నాకైతే ఏమీ తప్పు కనిపించటం లేదు.
వై.ఎస్.ఆర్. రాష్ట్రం కోసం ఏదో ఇరగబొడిశాడని ప్రచారం చేస్తున్నారు. కానీ తను స్వలాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టాడు. ఒక్కసారి గమనించండి. వేరే రాష్ట్రాల నుండి ఎంత మంది ఎం.పీ. లు ఎన్నికైనారు, కేంద్రం లో ఎన్ని మంత్రి పదవులు పొందారు, మన రాష్ట్రం పరిస్థితేన్టో. రాష్ట్రం పై పట్టు కోసం కేంద్ర మంత్రి పదవుల కోసం పట్టు పట్టకుండా వదిలి వేసాడని స్పష్టం గా అర్థమవుతుంది. జగన్ నాటకాలకు చెక్ పెట్టటానికి కేంద్రం అతని అక్రమ ఆస్తులపై విచారణ వేస్తుందని నాకు అనిపిస్తుంది.